యాదాద్రిలో నెల రోజుల పాటు కోటి కుంకుమార్చన పూజలు

యాదాద్రిలో  నెల రోజుల పాటు కోటి కుంకుమార్చన పూజలు

యాదగిరి గుట్ట: ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 30 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కోటి కుంకుమార్చన పూజలు జరగనున్నాయి. కోటి కుంకుమార్చన లో పాల్గొనే భక్తులకు రూ. 2 వేల టికెట్ ధర నిర్ణయించారు.  టికెట్ పై దంపతులకు మాత్రమే ఆలయ అధికారులుఅవకాశం కల్పించారు. టికెట్ పొందిన కుటుంబ సభ్యుల గోత్రనామాలపై 30 రోజుల పాటు సంకల్ప కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.