చలాన్ వేస్తే.. నా పెండ్లాం, పిల్లలు పస్తులుండాలి

చలాన్ వేస్తే.. నా పెండ్లాం, పిల్లలు పస్తులుండాలి
  • కాళ్లు మొక్కినా.. కనికరించలే
  • పది నిమిషాలు లేటైందని చలాన్

ట్రాఫిక్ జామ్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యమైందని..లాక్ డౌన్ రూల్స్ కింద కేసు బుక్ చేయొద్దంటూ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసు కాళ్లు మొక్కి వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి గిరాకీ కోసం తిరిగిన ఓ ఆటో డ్రైవర్ 10 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. ట్రాఫిక్ జామ్ కారణంగా10.10 నిమిషాలకు మదీనా చౌరస్తా దగ్గరికి చేరుకున్నాడు. లాక్ డౌన్ టైమ్​లో తిరుగుతున్నాడంటూ అక్కడి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్  ఆటోను ఆపాడు. ‘ ట్రాఫిక్ జామ్​తో లేటయ్యింది సార్.. ఉదయం నుంచి ఆటో నడిపినా గిరాకీ సరిగా లేదు..మీకు దండం పెడ్తా.. ఆటో మీద చలాన్ వేస్తే నా పెండ్లాం, పిల్లలు ఈ రోజు పస్తులుండాల్సి వస్తది’ అంటూ ఆటోడ్రైవర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు. అయినప్పటికీ ఆ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఆటోడ్రైవర్​తో దురుసుగా మాట్లాడాడు. ఆటోను పక్కకు ఆపమని, కేసు బుక్ చేయమని సిబ్బందితో చెప్పాడు.