Viral Video: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..చాకచక్యంతో ప్రాణాలతో బయటపడ్డ కార్మికుడు

Viral Video: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..చాకచక్యంతో ప్రాణాలతో బయటపడ్డ కార్మికుడు

షాద్ నగర్, వెలుగు: పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా రైలు కదలడంతో ఓ కార్మికుడు చాకచక్యం ప్రదర్శించి, ప్రాణాలతో బయటపడ్డాడు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్​రైల్వేస్టేషన్​కు ఒక పక్క రెసిడెన్షియల్ క్వాటర్స్, మరో పక్క పరిశ్రమలు ఉండగా, నిత్యం కొందరు కార్మికులు పుట్​ఓవర్ బ్రిడ్జ్‌ను వాడకుండా కింద నుంచే వెళ్తుంటారు. 

గురువారం సాయంత్రం బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు ఇలాగే వెళ్లగా, అకస్మాత్తుగా గూడ్స్‌ రైలు కదిలింది. దీంతో ఏం చేయాలో తెలియక ఓ క్షణం భయాందోళనకు గురయ్యాడు. మళ్లీ అంతలోనే ప్రాణాలు దక్కించుకునేందుకు ట్రాక్ మధ్యలో పడుకుండిపోయాడు. రైలు వెళ్లిన తర్వాత సదరు కార్మికుడు లేవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.