హీరో తేజ సజ్జ తొలిసారి రియాలిటీ షో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ పేరుతో రాబోతోన్న ఈ సరికొత్త షో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. మంగళవారం ఈ షో ట్రైలర్‌ను విడుదల చేశారు. నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ గేమ్‌లో 20 మంది సెలబ్రిటీలు పోటీపడనున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తేజ సజ్జ మాట్లాడుతూ ‘ఈ షోతో ఎక్సయిట్‌మెంట్, థ్రిల్‌ను తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
ఈ ఫార్మాట్ నాకు చాలా నచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఈ షోకు తొలి తెలుగు ఎడిషన్‌లో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ గేమ్‌లో ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో చివరి వరకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అబద్ధాలు, మైండ్ గేమ్స్, ఊహించని పొత్తులు షోలో ఆసక్తిని పెంచుతాయి’ అని అన్నాడు. ప్రైమ్ వీడియో కోసం ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ షోలో చిన్మయి శ్రీపాద, హర్ష వర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ సహా 20 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
