ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ దీక్ష

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ దీక్ష

ఢిల్లీలోని తెలంగాణ భవన్  గులాబీమయం అయ్యింది. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రవైఖరికి నిరసనగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష కొనసాగుతోంది.ఇప్పటికే కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయినేతలు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, రైతు కమిటి సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ధర్నాకు భారతీయ కిసాన్ యూనియన్ నేత టికాయత్ సంఘీభావం తెలిపారు. 


కేంద్రం యాసంగి ధాన్యం కొనాల‌నే డిమాండ్‌తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేప‌ట్టింది. ధాన్యం సేక‌ర‌ణ‌లో ఒకే విధానం ఉండాల‌నే డిమాండ్‌తో ఈ దీక్ష చేస్తున్నారు.వరి ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రానికి టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వ‌నుంది.దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కేంద్రంపై పోరును మ‌రింత తీవ్రం చేసే యోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు.కేసీఆర్ చేస్తున్న ధర్నా కేవలం తెలంగాణ కోసమే కాదని.. దేశంలోని మొత్తం రైతాంగం కోసమని చెబుతున్నారు నేతలు. రాష్ట్రంలోని వడ్ల కొనుగోళ్లను జాతీయ సమస్యగా చిత్రీకరిస్తూ.. నేషనల్ లెవల్ లో చర్చను లేవనెత్తాలని కేసీఆర్ భావిస్తున్నారు.దీక్షకు సంబంధించి పెద్దఎత్తున హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు నేతలు.

 

మరిన్ని వార్తల కోసం

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్​

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు