మెగా డీఎస్సీపై అభ్యర్థుల భారీ ఆశలు

మెగా డీఎస్సీపై అభ్యర్థుల భారీ ఆశలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్​స్సీకి ఆమోదం తెలుపుతామని, 2024 ఏప్రిల్, డిసెంబర్​లో  టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్నారు.గత ప్రభుత్వం సెప్టెంబర్ 6 న 5089 టిచర్ పోస్టులకు టిఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది.4 లక్షల మంది అభ్యర్థులు గత 6 ఏండ్లుగా టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తుంటే 2022 మార్చి 9 న అసెంబ్లీలో అప్పటి సిఎం కేసీఆర్ 13 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చివరకు సాగదీస్తూ ఎన్నికల ముందు కేవలం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.

పోస్ట్ లు పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. పరీక్ష తేదీలు కూడా ప్రకటించింది. నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కానీ, అంతలోనే ఎన్నికల కోడ్ రావడం ఎన్నికలు నవంబరు 30న ఉండడం తో అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీఎస్సీ పరీక్షలపై డైలమా నెలకొంది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు మెగా డీఎస్​సీ వేయాలని చాలా సార్లు అనేక మంది కాంగ్రెస్​ నాయకులు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో  5,089 పోస్టులకు వెలువడ్డ నోటిఫికేషన్ ఆపాలని మిగతా 20 వేల టీచర్ పోస్టులు జత చేసి మెగా డీఎస్సీ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో  విద్యాశాఖ  కొత్త మంత్రి  తో కొత్త సీఎం చర్చించి మంత్రి మండలి సమావేశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మేనిఫెస్టోలో కూడా తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. 5,089 టీచర్ పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందున మిగిలిన పోస్టులు జత చేసి రీ నోటిఫికేషన్ జారీ చేయాలని 4 లక్షల డీఎడ్ బీఎడ్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్​, బీఎడ్​అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు