వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు వెయ్యి బస్సులు..ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు వెయ్యి బస్సులు..ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులను ఇళ్ల కు చేర్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఘజియాబాద్ లోని ఘాజిపూర్ సరిహద్దు, నోయిడా సరిహద్దు ప్రాంతాలనుంచి వలస కార్మికులను సుమారు వెయ్యి బస్సుల్లో వారి ఇళ్లకు చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ సీఎం యోగికి లేఖ రాశారు.

అయితే ఆ లేఖపై యూపీ సర్కార్ స్పందించకపోవడంతో ప్రియాంక గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది రాజకీయాలు చేసేందుకు సమయం కాదు. మీరు అనుమతిస్తే వలస కార్మికుల్ని వారి ఇళ్లకు తరలిస్తాం. ఆ ఖర్చులన్నీ కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

దీంతో యూపీ సర్కార్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనిష్ అవస్ధీ ఉత్తర్వులను ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పంపించారు.  1,000 బస్సుల డ్రైవర్ల పేర్లతో పాటు ఇతర వివరాలను తమకు అందజేయాలని అవనిష్ కోరాను.