అయోధ్యలో నిర్మించే గుడికి శిల్పాలు రెడీ

అయోధ్యలో నిర్మించే గుడికి శిల్పాలు రెడీ

మొదటి నుంచీ… అయోధ్యలో ఎప్పటికైనా రామమందిరం కడతామన్న ధీమా విశ్వహిందూ పరిషత్​ (విహెచ్పీ)లో బలంగా ఉంది. దీనికోసం అయోధ్యలోని కరసేవక్​ పురంలో ఒక పెద్ద వర్క్​షాపు ఏర్పాటు చేసుకుంది. రామ మందిరానికి గీసిన ప్లాన్​ ప్రకారం… 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 128 అడుగుల ఎత్తులో ఆలయం తయారవుతుంది. రెండంతస్తులుగా నిర్మించే ఈ ఆలయంలో ఫ్లోర్​కి 106 చొప్పున మొత్తం 212 స్తంభాలుంటాయి. ప్రతి స్తంభం పైనా 16 విగ్రహాలను చెక్కుతారు. ఇప్పటికే 65 శాతం పని పూర్తయ్యిందని, మొదటి అంతస్తుకి అంతా రెడీగా ఉందని విహెచ్పీ అధికార ప్రతినిధి శరత్​ శర్మ చెబుతున్నారు.  ఈ వర్క్​షాపులో అమావాస్య నాడు మినహా మిగతా అన్ని రోజుల్లోనూ శిల్పులు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు. శిలలను ప్రి–ఫ్యాబ్రికేటెడ్​ పద్ధతిలో నెంబర్లు వేసి చెక్కుతున్నారు. వాటిని నిర్మాణ స్థలంలో జిగ్​సా పజిల్​ తరహాలో ఒకదానిలో ఒకటి చొప్పిస్తారు. రాజస్థాన్​లోని బన్సీ పహరాపూర్​ నుంచి, ఆగ్రా నుంచి పింక్​ పాలరాయిని తెప్పించారు. అయోధ్యతోపాటు పిండ్వారాలోకూడా ఒక వర్క్​షాపుని నిర్వహిస్తున్నారు.  అయోధ్యకు వచ్చే భక్తులు తప్పకుండా ఈ వర్క్​షాపుని కూడా చూసి వెళ్తున్నారని శర్మ చెబుతున్నారు.

.