నిర్మల్: జిల్లాలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయం గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. శతాబ్దం క్రితం నిర్మించిన ఈ భవనం.. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా తడిచిపోయింది. అధికారులంతా కార్యాలయం లోపలి గదుల్లో పనిచేస్తుండగానే గోడ కూలిపోయింది. అయితే గోడ కూలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బూత్ బంగ్లాను తలపించే ఈ కార్యాలయాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని తహశీల్దార్ సుభాష్ చందర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వేరే కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
