హై వోల్టేజ్ ట్రైలర్..ది వారియర్

హై వోల్టేజ్ ట్రైలర్..ది వారియర్

ఒంటిమీద యూనిఫాం లేకపోయినా రౌండ్  ద క్లాక్ డ్యూటీలో ఉంటానంటూ వచ్చేస్తున్నాడు హీరో రామ్ పోతినేని. ఫస్ట్ టైం రామ్   పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో నటించిన చిత్రం ది వారియర్.  తమిళ మాస్ దర్శకుడు ఎన్ లింగుస్వామి డైరెక్షన్‌లో భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.  కృతి శెట్టి  హీరోయిన్‌గా నటించగా.... విలన్గా ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా..తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. తెలుగు ట్రైలర్‌ను డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేయగా.. తమిళ్ ట్రైలర్‌ను తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ విడుదల చేశారు.

ఒక  చెట్టుపై 40 పావురాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే, ఇంకా ఎన్ని ఉంటాయి. అన్నీ ఎగిరిపోతాయి  అంటూ రామ్‌ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కర్నూల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ జరిగిన గురు (ఆది పినిశెట్టి) చేసిన అన్యాయాలను సత్య (రామ్ పోతినేని)  ఏ విధంగా అడ్డుకుంటాడు అనేది స్టోరీగా చూపించనున్నారు. పోలీస్ డ్రెస్లో రామ్..లుక్ అదరిగిపోయిందని చెప్పాలి. ఖాకీ డ్రెస్లో కోర మీసాలతో రామ్ చెప్పే డైలాగ్స్ వింటే  రోమాలు నిక్కపొడచుకోవాల్సిందే.  రామ్ పాత్ర ఎంత పవర్ ఫుల్గా కనిపిస్తుందో ..అటు గురు పాత్రలో ఆది పినిశెట్టి అంతే పవర్ ఫుల్గా ఉన్నాడు. రాయలసీమ యాసలో అతని డైలాగ్స్ హైలెట్గా నిలవనున్నాయి. 

మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి..ఈవినింగ్ అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ను చూశారా ఎప్పుడైనా అనే డైలాగ్తో ట్రైలర్లో కనిపించే కృతిశెట్టి..క్యూట్గా ఉంది. పర్ఫెక్ట్ పోలీస్గా ఉన్న రామ్ను లవర్ బాయ్గా మార్చే ప్రక్రియ ఆకట్టుకుంటుంది.  చివర్లో ఊరికి పట్టిన రోగం వేరు..ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ స్టార్ట్ అంటూ రామ్ చెప్పే డైలాగ్..హీరో విలన్ మధ్య జరిగబోయే వార్ను ప్రతిబింబిస్తుంది.  మొత్తానికి డైరెక్టర్ లింగుస్వామి సూపర్ పవర్‌ఫుల్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.  ఇక ది వారియర్ సినిమాను  జూలై 14న  తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.., శ్రీనివాస చెట్టూరి నిర్మించారు.