ఎరుపెక్కిన నది.. జనం పరేషాన్..

ఎరుపెక్కిన నది.. జనం పరేషాన్..

నదిలో ప్రవహించే నీళ్లు ఉన్నట్టుండి ఎర్రగా మారిపోయాయి. నీళ్లన్నీ రక్తంలాగా ఎరుపెక్కాయి. ఎందుకిలా అయిందో తెలియక స్థానికులంతా పరేషాన్ అయ్యారు. జపాన్  ఒకినావాలోని నాగో సిటీలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఇందుకు తామే కారణమంటూ ఓరియన్ అనే బీర్ ఫ్యాక్టరీ మేనేజ్​మెంట్ క్షమాపణలు చెప్పింది. తమ ఫ్యాక్టరీలోని కూలింగ్ సిస్టమ్ నుంచి లీకేజే కారణమని వివరణ ఇచ్చుకుంది.

బీరు తయారీకి ఫుడ్​లో రుచి కోసం కలిపే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ బుధవారం రాత్రి లీకై నదిలో కలిసిందని, గురువారం ఉదయాన్నే గుర్తించి సరిచేశామని చెప్పుకొచ్చింది. ఈ కెమికల్​తో ఎవరికీ ఎలాంటి హానీ ఉండదని పేర్కొంది.