ఎట్టకేలకు కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ

ఎట్టకేలకు కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ

వానాకాలం మొదలైన రెండు నెలల తర్వాత ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఫ్లడ్‌ సీజన్‌ మొదలై ఇన్నిరోజులైనా లేటుగా నీళ్ళ లిఫ్టింగ్ చేపట్టారు. ఎల్లంపల్లికి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కాళేశ్వరం లింక్‌ – 1లో లిఫ్టింగ్ ప్రారంభించారు. అన్నారం నుంచి మంగళవారమే ఎత్తిపోతలు మొదలుపెట్టిన ఇంజనీర్లు.. బుధవారం రాత్రి కన్నె పల్లి(మేడిగడ్డ) నుంచి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు ఆరు మోటార్లు ఆన్‌ చేశారు. క్రమంగా మిగతా ఐదు మోటారను్ల స్టార్ట్‌చేసి రోజుకు 2 టీఎంసీలు ఎల్లంపల్లికి ఎత్తిపోయనున్నారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌లద్వారా మిడ్‌ మానేరుకు లిఫ్టిం గ్ చేస్తున్నారు.ఎల్‌ఎండీ దిగువన ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీళ్వివ్వడంతో పాటు కొండపోచమ్మసాగర్‌ వరకు నీటి తరలింపు కోసం మిడ్‌ మానేరు డ్యాంను నింపాలని కేసీఆర్‌ ఇంజనీర్లను ఆదేశించారు.

మిడ్ మానేరులో అడుగంటిన నీళ్లు

ఫ్లడ్‌ సీజన్‌ మొదలైన రెండు నెలల తర్వాత కాళేశ్వరం లింక్‌ -1లో మోటార్ల పూర్తిస్థాయిలో ఆపరేట్‌ చేస్తున్నారు. ఇంతకుముందు ఎస్సారెస్పీ వరద కాల్వ కోసం ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ లిఫ్ట్ చేయగా.. అన్నారం, సుందిళ్ళలో మోటార్లు నడిపి ఎల్లంపల్లిలోకి ఒక టీఎంసీ ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎల్లంపల్లికి 6.50 టీఎంసీల నీళ్లురాగా అందులో ఐదు టీఎంసీలే ఎగువ నుంచి వచ్చాయి. సగం వానాకాలం పూర్తవడం, కడెం నుంచి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో ఎత్తిపోతలు మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు. మిడ్‌ మానేరు నీటిని ఎల్‌ఎండీ దిగువ ఆయకట్టుకు ఇవ్వడంతో కాళేశ్వరంకు లైఫ్‌లైన్‌గా పేర్కొనే మిడ్‌ మానేరు నీటిమట్టం 4 టీఎంసీలకు పడిపోయింది.

వరద వస్తదని ఎదురుచూస్తూ..

కడెం నుంచి భారీ వరద వస్తేకింది నుంచి లిఫ్ట్ చేసిన నీళ్ళను మళ్లీ కిందికే వదలాల్సి వస్తుందన్న ఉద్దేశంతో లింక్‌ -1 నుంచి లిఫ్టింగ్‌కు సీఎం ఇప్పటిదాకా పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు మేడిగడ్డగేట్లు ఎత్తివరదను నదిలోకి వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడుసీఎం ఆదేశాలతో లిఫ్టింగ్ స్టార్ట్‌ చేశారు. గతేడాది జూన్‌ 21న కాళేశ్వరంప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఆ ఏడాది జూలైలో ప్రాణహితకు భారీ వరదలు వచ్చాయి. అప్పుడు కన్నెపల్లినుంచి అన్నారం, సుందిళ్ళకు నీళ్లుఎత్తిపోసినా.. ఎగువ నుంచి భారీ వరద రావడంతో తిరిగి కిందికి వదలాల్సి వచ్చింది. కోట్ల రూపాయల కరెంట్‌ బిల్లుకట్టి ఎత్తిపోసిన నీటిని కిందికి వదలడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి మోటార్లు ఆన్‌ చేయలేదని ఇంజనీర్లు చెప్తున్నారు.కొండపోచమ్మకూ నీళ్లుఎల్‌ఎండీ దిగువ ఆయకట్టుకు కాకతీయ కాల్వద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకొన్నిరోజులు నీళ్లివ్వాలని సీఎం ఆదేశించడంతో..మిడ్మానేరు నుంచి ఇంకో నాలుగైదు టీఎంసీలు ఇవ్వాల్సి ఉండనుంది. ఇదే టైంలో లింక్‌ -4లోని కొండపోచమ్మసాగర్‌ వరకు నీళ్లుతరలించాలి. డిస్ట్రిబ్యూటరీలు సిద్ధం కాకపోవడంతో వీలైనంతఎక్కువ నీటిని తీసుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్టుతెలుస్తోంది. రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ను పూర్తిస్థాయిలో నింపాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం.

కడెం నుంచి వరద లేదు

కడెం ప్రాజెక్టుదాదాపు నిం డినా ఎగువ నుంచి వరద రావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురవట్లేదు. ఎస్సారెస్పీనుంచి దిగువకు ఇప్పట్లోవరద వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో కాళేశ్వరం లింక్‌ -1 నుంచి ఎల్లంపల్లికి నీటి లిఫ్టింగ్ మొదలు పెట్టిన ఇంజనీర్లు చెప్తున్నారు. ఎల్లంపల్లి నుంచి రోజుకు ఒక టీఎంసీని మిడ్‌ మానేరుకు ఎత్తిపోస్తున్నామని.. మెల్లగా రోజుకు రెండు టీఎంసీలకు పెంచుతామని అన్నారు. ఇక ఎగువన గోదావరి వెలవెలబోతోంటే దిగువన మేడిగడ్డవద్దప్రాణహిత నది ఉప్పొంగుతోంది.