Ram Charan :ఉదయ్‌పూర్‌లో తెలుగు ఎన్నారై పెళ్లి... ట్రంప్ కొడుకుతో రామ్ చరణ్ ముచ్చట్లు.. 'నాటు నాటు' స్టెప్పులు!

Ram Charan :ఉదయ్‌పూర్‌లో తెలుగు ఎన్నారై పెళ్లి... ట్రంప్ కొడుకుతో రామ్ చరణ్ ముచ్చట్లు.. 'నాటు నాటు' స్టెప్పులు!

రాజస్థాన్‍లోని ఉదయ్‏పూర్  వేదికగా జరిగిన ఎన్నారై ఫార్మా దిగ్గడం రామరాజు మంతెన కుమార్తె నేత్ర ,  వంశీ గాదిరాజు వివాహం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‍గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక ఒక అంతర్జాతీయ వేదికను తలిపించింది. దీనికి బాలీవుడ్ హీరోలతో పాటు టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, హాలీవుడ్ సెన్సేషన్ జెన్నీఫర్ లోపెజ్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.

 పెళ్లి వేడుకను షేక్ చేసిన జె.లో పర్‌ఫార్మెన్స్!

మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ నుండి షారూఖ్ ఖాన్, అమిర్ ఖాన్, సల్మాణ్ ఖాన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, కృతి సనన్, జాన్వీ కపూర్ వంటి స్టార్‌లు సంగీత్‌లో డ్యాన్స్‌లతో అదరగొట్టగా, ప్రముఖ డీజే టీస్టో, సింగర్ జస్టిన్ బీబర్ తన గాత్రంలో అలరించారు. అంతే కాకుండా 56 ఏళ్ల జెన్నీఫర్ లోపెజ్ (JLo) ఇచ్చిన అదిరిపోయే లైవ్ పర్‌ఫార్మెన్స్ అత్యంత హైలైట్ గా నిలిచింది. భారతదేశంలో ఆమెకు ఇది తొలి ప్రదర్శన. గోల్డ్, సిల్వర్ కలర్ బాడీసూట్‌లో మెరిసిన జె.లో, తన హిట్‌ సాంగ్స్‌తో స్టేజ్‌ను ఊపేశారు. 'గెట్ ఆన్ ది ఫ్లోర్', 'వెయిటింగ్ ఫర్ టునైట్' వంటి పాటలకు ఆమె చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసి అతిథులు ఫిదా అయ్యారు.

 రిసెప్షన్‌లో ఆమె వేసుకున్న బోల్డ్ డ్రెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగినా, ఉదయం జరిగిన పెళ్లి వేడుకలో మాత్రం ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సంప్రదాయ పింక్ చీరలో, వజ్రాల నగలూ, మాంగ్ టీకాతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు.

 

 గ్లోబల్ ప్రముఖులతో చెర్రీ సందడి

ఫార్మా దిగ్గజం ఇంగెనస్ ఫార్మా CEO అయిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన , సూపర్ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు,  ఫోర్బ్స్ ' అండర్ 30' జాబితాలో స్థానం పొందిన  వంశీ గాదిరాజు వివాహానికి టాలీవుడ్ నుంచి ఏకైక స్టార్‌గా రామ్ చరణ్ హాజరయ్యారు. చరణ్ స్టైలిష్ బ్లాక్ సూట్‌లో, తన 'పెద్ది' సినిమా కోసం పెంచిన పొడవాటి జుట్టుతో రాజసం ఉట్టిపడేలా కనిపించారు.

 

 ఈ సందర్భంగా ఆయన డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు.,నాటు నాటు సాంగ్ కు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కలసి స్టెప్పులు వేసి అలరించారు.  ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

ఉదయ్‌పూర్‌లోని అద్భుతమైన 'జగ్ మందిర్ ప్యాలెస్', 'లీలా ప్యాలెస్' వంటి వేదికల్లో జరిగిన ఈ వివాహం, అంబానీల పెళ్లి తర్వాత ఆ స్థాయిలో జరిగిన మరో అతిపెద్ద ఇండియన్ వెడ్డింగ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ వివాహానికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌,  జెన్నీఫర్ లోపెజ్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్. పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరవడంతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.