మన పాటకు ప్రపంచమంతా డ్యాన్స్ చేస్తోంది.. రాహుల్ గాంధీ ప్రశంసల వెల్లువ

మన పాటకు ప్రపంచమంతా డ్యాన్స్ చేస్తోంది.. రాహుల్ గాంధీ ప్రశంసల వెల్లువ

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఆస్కార్ రావడంపై ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభినందనలు తెలియచేశారు. ‘నాటునాటు పాటకు ప్రపంచమంతా డ్యాన్స్ చేస్తోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచినందుకు కీరవాణి, చంద్రబోస్ లకు కంగ్రాడ్యులేషన్స్. భారతదేశం గర్వపడేలా సినిమాను చిత్రీకరించిన డైరెక్టర్ రాజమౌళితోపాటు ఆయన మూవీ టీంకు శుభాకాంక్షలు’అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమాకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇద్దరు మహిళలు తెరకెక్కించిన అద్భుతమైన సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు.