
శంషాబాద్,వెలుగు: బిర్యానీ తింటుండగా ఆకస్మాత్తుగా గుండెపోటుతో ఓ మహిళ చనిపోయిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నగట్టుపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాయమ్మ(40) బంధువు వారం రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు. వారి కుటుంబీకులను పరామర్శించేందుకు ఆమె సిటీకి వచ్చింది. గురువారం తిరిగి సొంతూరికి వెళ్లేందుకు సాయమ్మ శంషాబాద్ బస్టాండ్ కి చేరుకుంది. అక్కడ బాక్సులో తన వెంట తెచ్చుకున్న బిర్యానీని తింటూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఐ విజయ్ కుమార్ సాయమ్మ గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించామన్నారు. కేసుఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.