మురుగు నీటి కుంటలోకి దిగి మహిళల ధర్నా

మురుగు నీటి కుంటలోకి దిగి మహిళల ధర్నా

కుమ్రంభీం జిల్లా: మురుగు నీటి కుంటలోకి దిగి మహిళలు ధర్నా చేశారు. ఈ ఘటన జిల్లాలోని గంగాపూర్ లో జరిగింది. నిన్న కురిన వర్షానికి డ్రైనేజీ లేకపోవడంతో ఇళ్లలోకి మురికి నీరు వస్తోందన్నారు. దీంతో  భారీ వర్షానికి నీటి కుంట చెరువుని తలపిసోందని ఆందోళనకు దిగారు. మహళలు నీటి కుంటలో దిగి నిరసన తెలిపారు. చేతి పంపు నుంచి మురికి నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీరు తొలగించేందుకు అర కిలోమీటర్ మేర రోడ్డు తవ్వారన్నారు. దీంతో రోడ్డు బురదమయంగా మారి.. నడవడానికి తీవ్ర ఇబ్బంది పతున్నామని వాపోయారు. మురుగు నీటి కుంట నుంచి దుర్వాసన వస్తోందని, దీంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు కుంటలో పడితే కాపాడేవారెవరని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.ఇప్పటికైనా గుంటలోని వరద నీటిని మళ్లించి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.