కాలుష్యం గుప్పిట్లో యమునా నది

కాలుష్యం గుప్పిట్లో యమునా నది

న్యూఢిల్లీ: యమునా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ప్రజల విశ్వాసం. కానీ ప్రస్తుత పరిస్థితిల్లో యమునా నదిలో స్నానం చేస్తే మాత్రం చావు ఖాయం. ఎందుకంటే కాలుష్యం వల్ల యమునా నదీ నీరు మొత్తం విషతుల్యంగా మారింది. ఫ్యాక్టరీలు, గృహ సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలతో నదీ జలం మొత్తం కలుషితంగా మారి... తెల్లని నురగ రూపంలో ప్రవహిస్తోంది. మంచు నదిలా కనిపిస్తున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీలో హిమానీనదం’ అని ఒకరు కామెంట్ చేస్తే, ఢిల్లీ అందం మరింత పెరిగిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఓపిక పట్టండి 2025 వరకు కేజ్రీవాల్ యమునా నదిని ప్రక్షాళన చేస్తారంటూ మరొకరు సెటైర్ వేశారు. 

యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం ఏడాది కిందటే కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్‌ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేయటంతో ప్రభుత్వం వాటిని బ్యాన్‌ చేసింది. ఈ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కాలుష్య తగ్గకపోవడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరిన్ని వార్తల కోసం...

‘బుర్జ్ ఖలీఫా’పై ‘విక్రమ్’ ట్రైలర్

కేసీఆర్ పాలనలో రాష్ట్రం ముందడుగు