బైకుతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు మృతి

బైకుతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు మృతి

మేడ్చల్ జిల్లాలో అతివేగానికి ఓ యువకుడు బలయ్యాడు. బైక్ పై వేగంగా వెళ్తూ కరెంట్ స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాచి అనే 22 ఏళ్ల యువకుడు పల్సర్ బైక్ మీద వేగంగా వెళ్తూ.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ సాకేత్ టవర్ వద్ద కరెంటు స్తంభానికి ఢీ కొట్టి కింద పడిపోయాడు. తీవ్రగాయాలై.. ఘటనాస్థలంలోనే చనిపోయాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెపుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.