
రామడుగు, వెలుగు: తన ప్రియుడికి దగ్గరవుతోందనే కోపంతో ఓ యువతి పక్కా స్కెచ్ వేసింది. ఎఫ్ బీలో ఆమె పేరుపై నకిలీ అకౌంట్ క్రియేట్ చేసింది. దీనికి ప్రియుడు కూడా సహకరించి ఫొటోలు, ఫోన్ నంబర్ ఇచ్చాడు. వీటితో అసభ్యకర పోస్టులు పెట్టి బ్లేమ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ కు చెందిన మహిళ, ఓ యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొత్తగా మరో యువతి అతడి జీవితంలోకి వచ్చిందని తెలుసుకున్న మహిళ జీర్ణించుకోలేకపోయింది. యువకుడితో మాట్లాడి యువతి ఫొటో తీసుకుని ఎఫ్ బీలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టడమేగాక యువతి ఫోన్ నంబర్ పెట్టి ఫోన్లు చేయాలని కోరింది. ఇది తెలుసుకున్న యువతి రామడుగు ఎస్సై అనూషకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.