
భగవద్గీతపై నేటి యువతకు చైతన్యం కల్పించేందుకు విశ్వహిందూ పరిషత్ ముందుకు రావడం అభినందనీయమన్నారు చినజీయర్ స్వామి ఆశ్రమ ప్రతినిధి దేవనత జీయర్ స్వామి. హైదరాబాద్ లో జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. శత్రు సంహారం కోసం అర్జునుడికి, శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీత శ్లోకాలను యువతతో పారాయణం చేయించడం గొప్ప కార్యక్రమం అని చెప్పారు దేవనత జీయర్ స్వామి. డిసెంబర్ 14న హైదరాబాద్ లో VHP నిర్వహించే లక్ష యువ గళ గీతార్చనలో పాల్గొనాలని యువతకు సూచించారు.