
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ క్వార్టర్ లో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి భారీగా బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ లోని సింగరేణి కాలనీ క్వార్టర్ నివసించే వెంకటరమణ కొత్తవాడి మీడియా జీఎం ఆఫీసులో క్లర్కు. ఆమె ఉదయం ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది.
లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 20 తులాల బంగారంతో పాటు రూ. 2 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కొత్తగూడెం టూ టౌన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇన్ స్పెక్టర్ డి. ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ వెళ్లి ఇంటో ఫింగర్ ప్రింట్స్ సేకరించింది. పట్టపగలు చోరీ జరగడం రుద్రంపూర్ ఏరియా ప్రజల్లో భయాందోళన నెలకొంది.