
శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఒ యువకుడు మెదక్ జిల్లా నర్సాపూర్ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి దాదాపు 11:30 నిమిషాలకు నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు రాగా.. కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్, వీడియోను పరిశీలించారు. దీంతో నిందితుడు తేజావత్ భాస్కర్ వయసు 33 సంవత్సరాలు అని గుర్తించారు. నర్సాపూర్ మండలం పెద్దమ్మతండకు చెందిన ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.