లాల్ గాడి మలక్ పేట పెద్దమ్మ ఆలయంలో చోరీ

లాల్ గాడి మలక్ పేట పెద్దమ్మ ఆలయంలో చోరీ

శామీర్ పేట, వెలుగు : మేడ్చల్ జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పరిధిలోని లాల్ గాడి మలక్ పేట్ పెద్దమ్మ ఆలయంలో అమ్మవారి నగలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.  బుధవారం రాత్రి పెద్దమ్మ ఆలయం తాళాలు పగులగొట్టి అమ్మవారికి చెందిన అర తులం బంగారు ఆభరణాలు, ఐదు తులాల వెండి ఆభరణాలను దొంగిలించారు. వాటి విలువ రూ. 80 వేలు ఉంటుంది.

గురువారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులకు తెలియడంతో  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు.  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు జీనోమ్​ వ్యాలీ పీఎస్ సీఐ యాదగిరి గౌడ్ తెలిపారు.