
ఉప్పల్, వెలుగు: పార్క్చేసిన రెండు ఆర్టీసీ బస్సుల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఉప్పల్పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగింది. డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి నైట్ హాల్టింగ్‌కు వచ్చిన తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను డ్రైవర్లు ఉప్పల్రింగ్రోడ్డు, మెట్రో స్టేషన్వద్ద పార్క్‌చేశారు.
సూపర్ లగ్జరీ బస్సులో డ్రైవర్ యాకయ్య నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి అతని బ్యాగ్, ఫోన్, పర్సులోని రూ.5 వేలు, ఐడీ కార్డు, డిపో ఎస్ఆర్ లార్జ్ షీట్ తదితర వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రాజధాని బస్సులో డ్రైవర్ రాజు నిద్రిస్తుండగా.. బస్సు కీని దొంగలించారు.
మంగళవారం తెల్లవారుజామున లేచిన డ్రైవర్లు చోరీ జరిగినట్లు గుర్తించి, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పెట్రోలింగ్ లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలిపారు.తాము ఉన్నతాధికారులకు ఏం సమాధానం చెప్పాలి.. తమ ఉద్యోగాలు ఉంటాయో లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు.