ఉల్లిగడ్డల దొంగతనం.. వీడియో వైరల్..

ఉల్లిగడ్డల దొంగతనం.. వీడియో వైరల్..

సీసీ ఫుటేజ్‌లో రికార్డ్
దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డలకు డిమాండ్ బాగా పెరిగింది. అకాల వర్షాలతో ఉల్లి పంట పాడవడంతో ఒక్కసారిగా ఉల్లి రేటు అమాంతం పెరిగిపోయింది. ఆకాశాన్నంటిన ధరలతో ఉల్లి కోయకుండానే కన్నీళ్ళు తెప్పిస్తోంది. ఇప్పటికే కేజీ ఉల్లి రూ. 200 మార్కుదాటి కాకరేపుతోంది. దాంతో ఉల్లికి దేశవ్యాప్తంగా బాగా గిరాకీ పెరిగింది. కొంతమంది అయితే అంత డబ్బు పెట్టి ఉల్లి కొనలేక ఏకంగా దొంగతనాలకు తెగబడుతున్నారు.

మహారాష్ట్రలోని డోంగ్రీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట దుకాణాల్లో ఉల్లి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. డోంగ్రీలో డిసెంబర్ 5వ తేదీన ఇద్దరు వ్యక్తులు మూసివేసిన షాపుల నుంచి రూ. 21,160ల విలువచేసే ఉల్లిగడ్డను దొంగతనం చేశారు. ఆ దొంగతనం అంతా షాపు ముందున్న సీసీ ఫుటేజీలో రికార్డయింది. దాని ఆధారంగా దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తల కోసం..

హర్రీ.. అక్కడ 5 కేజీల ఉల్లిగడ్డ రూ. 100లకే..

ఎన్టీఆర్‌ను గద్దె దింపిన పాపంలో నేనూ భాగస్వామినే