'వారి ధైర్యసాహసాలు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి': కార్గిల్ అమరులకు నివాళులు

'వారి ధైర్యసాహసాలు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి': కార్గిల్ అమరులకు నివాళులు

కార్గిల్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన జవాన్లకు నివాళులు అర్పిస్తూ, వారి ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంతో భారత్ సాధించిన విజయాన్ని గుర్తుచేసే కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

"కార్గిల్ విజ‌య్ దివ‌స్ భార‌త‌దేశానికి చెందిన ఆ అత్య‌ద్భుత ధైర్య‌హృద‌యాల వీరోచిత గాథ‌ను తెర‌పైకి తీసుకువస్తుంది. వారు ఎల్లప్పుడూ దేశ ప్ర‌జ‌ల‌కు స్పూర్తిదాయకంగా ఉంటారు. ఈ విశిష్ట రోజున నేను వారికి నా హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను" అని ప్రధాన మంత్రి అని ట్విట్టర్‌లో రాశారు.

कारगिल विजय दिवस भारत के उन अद्भुत पराक्रमियों की शौर्यगाथा को सामने लाता है, जो देशवासियों के लिए सदैव प्रेरणाशक्ति बने रहेंगे। इस विशेष दिवस पर मैं उनका हृदय से नमन और वंदन करता हूं। जय हिंद!

— Narendra Modi (@narendramodi) July 26, 2023
 
 

 

యుద్ధ వీరులకు రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా 1999 కార్గిల్ లో ప్రాణాలర్పించిన యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. వారి శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. "కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన యోధులందరికీ వందనాలు" అని ఆమె ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

कारगिल विजय दिवस पर देश की रक्षा के लिए अपने प्राणों की बाज़ी लगा देने वाले सभी योद्धाओं को नमन! #kargilvijaydivas pic.twitter.com/xyfjaPOhrF

— Rajnath Singh (@rajnathsingh) July 26, 2023
 
 

 

లడఖ్‌లో విజయ్ దివస్ ఈవెంట్

విజయ్ దివస్‌ను పురస్కరించుకుని 1999 కార్గిల్‌లో 5వందలకు మందికి పైగా సైనికులు అమరులయ్యారు. వారి స్మారకార్థం లడఖ్ లో రెండు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలు లామోచెన్ వ్యూ పాయింట్‌లో ప్రారంభం కాగా.. అక్కడ యుద్ధ వీరులు, మరణించిన సైనికుల కుటుంబాలు వారిని స్మరించుకున్నారు. శౌర్య సంధ్యగా పిలువబడే ఈ వేడుక లడఖ్ స్కౌట్స్ రెజిమెంటల్ సెంటర్ ఫ్యూజన్ బ్యాండ్ చేత దేశభక్తి గీతాల ఉద్వేగభరితమైన ప్రదర్శనతో ప్రారంభమైంది.

 

#WATCH | Ladakh: Wreath laying ceremony being held at Kargil War Memorial in Drass on Kargil Vijay Diwas, to pay tribute to soldiers who lost their lives in the 1999 Kargil War. pic.twitter.com/qeVc6ynpIQ

— ANI (@ANI) July 26, 2023