ఎంసెట్ ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 65,219 సీట్లు

ఎంసెట్ ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 65,219 సీట్లు
  • 16 వరకు వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ప్రారంభం అయింది. శనివారం నాటికి ఎంసెంట్ ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో172 కాలేజీల్లో 65,219 సీట్లు ఉన్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. 15 ప్రభుత్వ కాలేజీల్లో 3,645 సీట్లు ఉండగా,157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 61,574 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నట్లు తెలిపారు. దీంట్లో ఎకజేఎన్టీయూ పరిధిలో146 కాలేజీల్లో 56,389 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. బీ ఫార్మసీలో 112 కాలేజీల్లో 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు, 109 కాలేజీల్లో 3,130 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయన్నారు. ఫార్మా డీలో 53 కాలేజీల్లో 520 సీట్లు ఉన్నాయని నవీన్ మిట్టల్ తెలిపారు.  శనివారం నుంచి వెబ్ ఆఫ్షన్లు ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ కాగా ఈ నెల 16 తో ముగియనుంది. ఇంజీనీరింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6 వేల సీట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది. కాలేజీల అఫ్లియేషన్ పక్రియ ఇంకా పూర్తి కాకపోవటంతో ఇంజనీరింగ్ లో సీట్లు పెరిగే చాన్స్ ఉంది.