గోదావరిఖని, వరంగల్రూరల్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి లేదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఎన్టీపీసీ మిలీనియమ్ హాల్‌లో రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో, మంగళవారం ఉదయం వరంగల్ఎన్ఐటీలో వరంగల్, కరీంనగర్, రామగుండం పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని తెలిపారు. రాష్ట్ర పోలీసులతోపాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
See Alos: ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం
రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు
ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో తప్పులే తప్పులు
నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

