చనిపోయిన వారి ఓట్లున్నాయి.. మా ఓట్లెందుకు లేవు..?

చనిపోయిన వారి ఓట్లున్నాయి.. మా ఓట్లెందుకు లేవు..?

ఓట్ల గల్లంతుపై అధికారు.. సిబ్బందిని నిలదీస్తున్న జనం

జియాగూడ పోలింగ్ బూత్ నెంబర్-38లో ఓట్ల గల్లంతు

914ఓట్ల కు గాను ..657ఓట్లు గల్లంతు

హైదరాబాద్: కార్వాన్ సర్కిల్ లోని జియాగుడా లో ఓట్ల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. బూత్ నెంబర్ -38లో మొత్తం 257 ఓట్లు గల్లంతయ్యాయి. తమ పేర్లు ఓటర్ లిస్ట్ లో లేకపోవడం పై ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఓట్లున్నాయి.. మరి మా ఓట్లెందుకు లేవు.. ? అంటూ పలువురు ఓటర్లు అధికారులు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొందరైతే తమకు ఓటర్ ఐడీ… ఆధార్ ఉంది కాబట్టి ఓటు వేస్తామని అంటున్నారు. వేరే పోలింగ్ స్టేషన్లో వెళ్లి వెతుక్కోమని చెబుతుండడంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టేట్ ఈసీకి ఫోన్ చేసి వివరణ అడుగుతున్న ఓటర్లు

ఓటర్ల జాబితాలో పేర్లు లేని పలువురు నేరుగా రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథికి ఫోన్ చేసి వివరణ అడుగుతున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల సిబ్బందితో వాగ్వాదం చేసిన వారు.. అదే ఆవేశంతో ఈసికి ఫోన్ చేసి తాము ఓట్లు ఎక్కడ వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం 19 వేల 656 ఓటర్లను వేరే వార్డ్ లకు తరలించారు.. దీని వల్లే లిస్ట్ లో పేర్లు లేవు..  అక్కడి పొలిటీషియన్ ఒకరు కావాలనే ఇలా చేశారని ప్రచారం జరుగుతోందని ఆరోపణలు చేశారు. వోటర్ల లిస్ట్ లో డిలీట్ అని వస్తే… డిలీట్ అయినట్లేనని… వెబ్సైట్ లో tpoll యాప్ లో చెక్ చేసుకోవచ్చు లేదా 1950 కి కాల్ చేయవచ్చుని సూచిస్తున్నారు.