కరోనా ఎపెక్ట్.. ఫిజియోథెరపిస్ట్​లకు పెరుగుతున్న డిమాండ్

కరోనా ఎపెక్ట్.. ఫిజియోథెరపిస్ట్​లకు పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్, వెలుగుకరోనాతో ఫిజియోథెరపిస్ట్​లకు డిమాండ్పెరుగుతోంది. వైరస్​ భయంతో జనం  బ్రీతింగ్ ఎక్సర్ సైజ్​లపై ఇంట్రెస్ట్ ​పెడుతున్నారు. బాడీ పెయిన్స్, పెరాలసిస్ వంటి సమస్యలకు ఎక్కువగా సేవలందిస్తున్న ఫిజియోథెరపిస్ట్​లు ప్రస్తుతం కరోనా సింప్టమ్స్, లంగ్స్, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్లకూ సర్వీస్​ ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్  పాజిటివ్ పేషెంట్స్​కి లంగ్స్​లో ఇన్ఫెక్షన్ చేరకుండా ఫిజియోథెరపీ చేయిస్తున్నాయి. చాలామంది సర్టిఫైడ్ ఫిజియోథెరపిస్ట్​లు హోమ్ ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు.

ఒక్కో థెరపీ అరగంటకు పైగానే..

పేషెంట్ హెల్త్ కండిషన్, డాక్టర్ రిపోర్ట్స్ చూసిన తర్వాతే ఇంటికి వెళ్లి ఫిజియోథెరపిస్ట్ లు ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. సింప్టమ్స్​ఉండి, కరోనాతో ఇబ్బంది పడుతుంటే డాక్టర్స్ సలహా తీసుకుని  వీడియో కాల్స్ ద్వారా బ్రీతింగ్, లంగ్స్ ఎక్సర్ సైజ్ చేయిస్తున్నారు. ఒక్కో థెరపీ 10 నిమిషాల నుంచి గంటపైన ఉంటోంది. ఏజ్డ్​ పర్సన్స్​కి ప్రాణాయామం చేయాలని సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో 10 నుంచి 45నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయిస్తున్నారు. ముక్కుతో  ఊపిరి తీసుకుంటూ నోటితో గాలి వదలడం  వల్ల బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ తో పాటు లంగ్స్ కి కూడా మంచిదని ఫిజియోథెరపిస్ట్ రవికిరణ్ తెలిపారు.

ప్రాణాయామంతో పాటు యోగా..

పేషెంట్ ఏజ్,  తీసుకునే ఫుడ్,  సీజన్, మెడిసిన్స్ ఇలా అన్ని చూశాకే ట్రీట్​మెంట్​ స్టార్ట్​ చేస్తాం. ప్రస్తుతం మజిల్స్​ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు సినియర్ ​సిటిజన్స్​కు  ఫిజియోథెరపీ చేస్తున్నా. కరోనా అటాక్ అవకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం.  ప్రాణాయామంతోపాటు యోగా
యాలని సూచిస్తున్నాం.

– రవికిరణ్, యోగా, ఫిజియోథెరపిస్ట్