ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 26వ జాతీయ హునార్ హాత్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి రాజనాధ్ సింగ్. హస్తకళలా నైపుణ్యం బాగుంటుందని…కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. శిల్పకళాకారులకు ప్రోత్సాహం తక్కువగా ఉందని…వారిని ప్రోత్సహిస్తామన్నారు. ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాజ్ నాథ్. కళాఖండాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆదుకుంటామన్నారు. హునార్ హాత్ ద్వారా 5 లక్షల ఉద్యోగాలను సృష్టించామన్నారు.