రౌడీ షీటర్స్ పై టాస్క్ ఫోర్స్ ఎల్లప్పుడూ ఉంటుంది : రష్మీ పెరుమాళ్

రౌడీ షీటర్స్ పై టాస్క్ ఫోర్స్  ఎల్లప్పుడూ ఉంటుంది : రష్మీ పెరుమాళ్

  షా ఇనాయట్ గంజ్ పీఎస్ లిమిట్స్ లోని గ్యాంగ్ వార్ కేసులో ఐదుగురు రౌడీ షీటర్స్ ని అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. రెండు గ్యాంగ్స్ మధ్య కొన్నిరోజులుగా వార్ జరుగుతుందని షేక్ ఇర్ఫాన్ అహ్మద్ తన గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి మరో గ్యాంగ్ లీడర్ షేక్ ఇస్మాయిల్ ఆదిల్ ని చంపడానికి ప్లాన్ వేశాడని చెప్పారు. రివేంజ్ మర్డర్ ప్లాన్ చేస్తుండగా వీరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.

 షేక్ ఇర్ఫాన్ పైన 16 కేసులున్నాయని ఇస్మాయిల్ పై కూడా గతంలో కేసులున్నాయని తెలిపారు. జనవరిలో జరిగిన ఒక మర్డర్ కేసులో ఇస్మాయిల్ నిందితుడని చెప్పారు. ఇస్మాయిల్ జైల్ నుంచి బయటకి రాగానే ప్రతీకారంగా ఇర్ఫాన్ అతడిని చంపడానికి ప్లాన్ చేశాడని అన్నారు. ఈ కేసులో ఇర్ఫాన్, ఇస్మాయిల్ తో పాటు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. 

నిందితుల నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, లైవ్ రౌండ్స్, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడుతామని చెప్పారు. రౌడీ షీటర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల నిఘా ఎల్లవేళలా ఉంటుందన్నారు డీసీపీ రష్మీ పెరుమాళ్.