
హైదరాబాద్, వెలుగు: కరోనా, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ స దసరాకు ‘అలయ్ బలయ్’ నిర్వహించడం లేదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా అనగానే జమ్మి చెట్టుతోపాటు అలయ్ బలయ్ గుర్తొస్తుందని, 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కానీ ఈ సారి పరిస్థితులు అనుకూలించలేదని, వచ్చే ఏడాది ఘనంగా నిర్వహిద్దామని దత్తాత్రేయ అన్నారు.