మార్పేమీ లేదు.. వెంటిలేటర్ పైనే ప్రణబ్ ముఖర్జీ

మార్పేమీ లేదు.. వెంటిలేటర్ పైనే ప్రణబ్ ముఖర్జీ

కరోనా బారిన పడ్డ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పటల్ హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏ మాత్రం మార్పు లేదని .. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని వెల్లడించింది. ఆరోగ్య పరిస్థితిని  ఎప్పటికపుడు డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ప్రణబ్ ముఖర్జీకి వారం రోజుల క్రితం బ్రెయిన్ సర్జరీ జరిగింది. అదే సమయంలో హాస్పిటల్ లో కోవిడ్ టెస్టు చేయగా  కరోనా పాజిటివ్ వచ్చింది.  అదే ఆస్పత్రిలో (ఆగస్టు 10న)  ఆయనను అడ్మిట్ చేశారు.