మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపాయే

మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపాయే

కరీంగూడ.. ఉత్తమ గ్రామ పంచాయతీ, పల్లె ప్రగతిలో అవార్డు తీసుకున్న ఊరు... కానీ తాగేందుకు మాత్రం చుక్క నీళ్లు లేని పరిస్థితి. బిల్లులు మాత్రం నెలనెల వస్తాయి. దీంతో మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రం కరీంగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఒక్కటి కాదు, రెండు కాదు... మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖాళీ బిందెలతో తమ నిరనసను వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు.  గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు.. నీళ్లు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు రాకున్నా..  బిల్లులు మాత్రం నెల నెలా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.  జిల్లా కలెక్టర్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. చివరికి మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం పొందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

మరిన్ని వార్తల కోసం..

జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్ ?

సూపర్ స్టార్ 79వ బర్త్ డే .. ఫోటో గ్యాలరీ