జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్ ?

జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్ ?

గుజరాత్ లో కాంగ్రెస్ కు షాకిచ్చే పరిణామం ఇది. ఇటీవల  హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సోమవారం రోజున ట్విటర్ వేదికగా హార్దిక్ పటేల్ ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. పంజాబ్ లో సింగర్ సిధు మూసేవాలా హత్య కు ఆప్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అసురక్షిత హస్తాల్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎంతలా మారిపోయాయో పంజాబ్ ప్రజలు ఇప్పుడు కళ్లారా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో చేరడం లేదని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటే వెల్లడిస్తానని కూడా ఆ ట్వీట్ లో హార్దిక్ పేర్కొన్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం  హార్దిక్ పటేల్ తమ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నాయి. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న బీజేపీ కార్యాలయం వేదికగా జూన్ 2న ఆయన కమలదళంలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ‘‘బీజేపీ నాయకత్వం పార్టీపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా గొప్పగా పనిచేస్తోంది. ఇటీవల బీజేపీ నాయత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు  ఆ పార్టీని రాజకీయంగా బలోపేతం చేశాయి. ఈవిషయాన్ని మనం విశాల దృక్పథంలో అంగీకరించాల్సి ఉంటుంది. నిజాలను నిజాలుగా గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ఇటీవల హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేందుకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు..

స్వీపర్‌‌‌‌‌‌‌‌ కొడుకు.. ఇక కలెక్టర్

సూపర్ స్టార్ 79వ బర్త్ డే .. ఫోటో గ్యాలరీ