ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.. ఈ మదర్స్ డేకి మీ అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.. ఈ మదర్స్ డేకి మీ అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు

"ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.." 'కేజీఎఫ్' సినిమాలోని ఈ డైలాగ్  విన్న ప్రతీ సారి.. మనసులో తెలియని భావం, తల్లి రూపం, ఆమె మన కోసం చేసిన త్యాగాలు, చూపించిన ప్రేమ.. ఇలా అన్నీ గుర్తుకువస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంత గొప్పటి మాతృమూర్తి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక రోజు మాత్రమే ఉంటే సరిపోతుందా.. రోజూ ఆమె రోజులే ఎప్పుడవుతాయి.. అన్న ప్రశ్నలూ ఇప్పటికీ ఏదో ఒక వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆమెను కీర్తించడానికి, గొప్పగా చెప్పుకోవడానికి సంవత్సరంలో కనీసం ఒక్క రోజు కూడా లేకపోతే ఎలా అన్న విషయాన్ని మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు. కాబట్టి మదర్స్ డే (మే 14)రోజున.. ఆమెకు నచ్చిన, మెచ్చిన బహుమతులు ఇవ్వండి. పిల్లలుగా మీ బాధ్యతలు నెరవేర్చండి.

మదర్స్ డే స్పెషల్

జీవితం మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన మహిళగా భావించే అమ్మకు... అంతే ప్రేమతో మదర్స్ డే రోజున ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వెంటనే ఈ కింద తెలిపిన సూచనలు, సూచనలు పాటించండి.. అమ్మకు కానుకగా ఇచ్చి, ఆమెను సంతోషపెట్టండి.

చర్మ సంరక్షణ ఉత్పత్తులు

మార్కెట్ లో అనేక చర్మ సంరక్షణ బ్రాండ్‌లు మీ తల్లి కోసం బహుమతిగా ఇవ్వండి. ఆమెకు ఉపయోగపడే, సులభంగా వాడగలిగే సహజ సౌందర్య ఉత్పత్తులను ఓ అందమైన హాంపర్‌లో ప్యాక్ చేసి కానుకగా ఇవ్వండి. మదర్స్ డే నాడు మీ చర్మ సంరక్షణ హాంపర్‌తో ఆమె జీవితానికి అదనపు మెరుపును తీసుకురండి

ఆరోగ్యమే బహుమతి

తల్లిగా మారాక అందంతో పాటు ఆరోగ్యం మరింత అవసరం. అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌లను అందించే వెల్‌బీయింగ్ న్యూట్రిషన్ నుంచి వెల్‌నెస్ ప్రోడక్ట్‌ల వరకు ఏవి మీ తల్లికి ముఖ్యమైనవో ఆలోచించండి. మహిళగా జీవితంలో ఆమె ఎన్నో కీలక పాత్రలు పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించే ఆమె కోసం 50+ కోసం మల్టీవిటమిన్‌లను, మెదడు, గుండె ఆరోగ్యానికి వర్జిన్ ఒమేగా లను కానుకగా కూడా ఇవ్వవచ్చు.

 హెల్త్ ఇన్సూరెన్స్

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇంకేదైనా హెల్త్ స్కీమ్ లు ఇంతకుముందే ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేకపోతే మాత్రం మీ మదర్ కోసం.. ఈ మదర్స్ డే రోజునే ప్రారంభించండి.

కిచెన్ వస్తువులు

మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అనే కాలం నుంచి వాళ్లూ అన్ని పనులూ చేస్తారన్న కాలంలోకి వచ్చేశాం. అయినా ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో మహిళలే వంట చేయాలి.. కిచెన్ అంటే వాళ్లదేనని కొందరు అపోహలకు పోతూ ఉంటారు. కొన్నిసార్లు తప్పదనిపించినా, కష్టమైనా ఆ పని మహిళలదే అవుతోంది. కాబట్టి మీ కిష్టమైన అమ్మ కోసం వంటింటికి కావల్సిన వస్తువులను కానుకగా కొనిపెట్టండి.. చిన్నదా, పెద్దదా కాదు.. మీరు పెట్టే ఎఫర్ట్స్ వాళ్లను మరింత సంతోషపరుస్తాయని మరవకండి.

చీరలు, నగలు

ఆడవాళ్లు అనగానే చాలా మంది వెంటనే గుర్తొచ్చేది చీరలు, నగలు. మీ స్థోమతకు తగ్గ రీతిలో వీటిలో ఏదో ఒకటి కొనివ్వండి. చాలా మంది తల్లులు తమకు లేకపోయినా పిల్లలకు ఉంటే చాలని సంతృప్తిపడుతూ ఉంటారు. అలాంటి తల్లులకు ఓ మధుర జ్ఞాపకంగా ఏదైనా ఇవ్వండి.. వారు గుండెల్లో పెట్టుకుని గుర్తుంచుకుంటారు.. ఎంతైనా పిల్లలిచ్చిన బహుమతి కదా.

ఫొటో ఫ్రేమ్

కుటుంబం సంతోషంగా, కలిసి ఉండాలంటే నాన్న పాత్ర ఎంతముఖ్యమో.. ఇంట్లో సంబంధాలు మెరుగవ్వాలన్నా.. బలోపేతం కావాలన్నా తల్లుల పాత్రా అంతే ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు సంతోషపెట్టిన చిన్న చిన్న సరదాలు.. వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఒక ఫ్రేమ్ గా చేసి ఇవ్వండి. దాన్ని చూసినప్పుడల్లా తనకు ఎంతమంది తోడుగా ఉన్నారో గుర్తుకుతెస్తుంది.

చెప్పుకుంటే పోతే ఇలా చాలానే ఉంటాయి. మన తల్లికి ఏమిస్తే సంతోషపడుతుందో తెలియకపోతే.. కనీసం వాళ్లకు ఏం అవసరమో అయినా తెలుసుకుని వారికి అందించడానికి ప్రయత్నించండి.