తెల్ల కాగితంతో నిరసన తెలుపుతున్న చైనా ప్రజలు

తెల్ల కాగితంతో నిరసన తెలుపుతున్న చైనా ప్రజలు

జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా చైనాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్ లాక్ చైనా అంటూ అక్కడి జనం తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా చైనా పాలకులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలంతా తెల్ల కాగితాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. ‘జిన్ పింగ్ స్టెప్ డౌన్, ఫ్రీ చైనా అంటూ’ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో ఎక్కడ తెల్ల కాగితం కనిపించినా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు.

చైనాలో ఎవరైనా ప్రభుత్వాన్ని, పదవుల్లో ఉన్న వ్యక్తులను కించపరిచినట్టు మాట్లాడినా, వ్యతిరేకంగా ప్ల కార్డులు పట్టుకొని నిరసనలు చేసినా అక్కడి చట్టాలు వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాయి. అందుకే అక్కడి ప్రజలు తెల్ల కాగితాన్ని నిరసన చేయడానికి ఎంచుకున్నారు. దీనికి  అక్కడి స్టూడెంట్లు కూడా మద్దతునిస్తున్నారు. కాలేజి, యూనివర్సిటీల్లో తెల్ల కాగితాలు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. అయితే, ఈ విప్లవానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను  సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆన్ లైన్ నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను డిలిట్ చేయిస్తుంది. దుకాణాల్లో తెల్ల కాగితాల్ని అమ్మనివ్వట్లేదు. తెల్ల కాగితాల ప్రొడక్షన్ ని ఆపేసారు. దీంతో చైనాలోని ఎం అండ్ జీ స్టేషనరీ అనే కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి.