రైల్వే శాఖ నిర్ణయాల్లో నైతికత ఉండాలి... రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చేతనా నంద్ సింగ్

రైల్వే శాఖ  నిర్ణయాల్లో  నైతికత ఉండాలి... రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్  చేతనా నంద్  సింగ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఏదైనా నిర్ణయం తీసుకుంటే అత్యున్నత సమగ్ర ప్రమాణాలు, నైతికత పాటించాలని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చేతనా నంద్ సింగ్  సూచించారు.

 సికింద్రాబాద్​లోని రైల్​ నిలయంలో శనివారం ‘స్టే ఎథికల్లీ విజిలెంట్ ఆల్వేస్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ కార్పొరేట్ కోచ్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ హిమాన్షు విష్ణోయ్ ఉపన్యాసం ఆకట్టుకుంది. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్​ జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్, ప్రధాన విభాగాధిపతులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.