కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. నిందితుల మధ్య 143 ఫోన్ కాల్స్

కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. నిందితుల మధ్య 143 ఫోన్ కాల్స్

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో  హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ కీలక  విషయాలు వెల్లడించారు.  కిడ్నాపర్లు మల్లికార్జున్ రెడ్డి(అనంతపూర్), సంపత్ కుమార్(ఆళ్లగడ్డ), అఖిలప్రియ,) పీఏ బాలచెన్నయ్య(కడప)ను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ ఎలా జరిగిందనేది నిందితులు వాడిన సెల్ ఫోన్ ట్రేసింగ్ ద్వారా వివరించారు. కిడ్నాప్ కోసం మియాపూర్ లో అఖిల ప్రియ, కిడ్నాపర్లు టెంపరరీగా ఆరు నంబర్లు, ఫోన్ లు కొన్నారు. కిడ్నాప్ కోసం అఖిలప్రియ 7095637583 నెంబర్ వాడింది. కిడ్నాప్ కు ముందే నిందిుతులు  రెక్కి  నిర్వహించారని చెప్పారు.

ఏ1 నిందితురాలు భూమ అఖిలప్రియ జనవరి 5న సాయంత్రం 5.30కి విజయవాడ నుంచి హైదరబాద్ కు బయల్దేరారు. హైదరాబాద్ కు బయల్దేరినప్పుడు ఆమె వాడిన టెంపరరీ నంబర్ , రెగ్యులర్ నంబర్లు  ఒకేసారి లొకేషన్ మూవ్  మెంట్ కావడం జరిగింది. దాదాపు రాత్రి 10 గంటల వరకు ఆమె హైదరాబాద్ కు రీచ్ అయ్యింది. ఈ మధ్య జర్నీలో అఖిలప్రియ నిందితుడు గుంటూరు శ్రీనుకు కాల్ చేసింది. మిగతా కిడ్నాపర్లు వాడిన టెంపరరీ నంబర్లకు కూడా అఖిల ప్రియ కాంటాక్ట్ లో ఉంది. నిందితుడు గుంటూరు శ్రీను వాడిన సిమ్ ద్వారా ట్రేస్ చేశాం. అఖిల ప్రియ ఫోన్ నుంచి గుంటూరు శ్రీనుకు 49 ఫోన్ కాల్స్ చేశారు. గుంటూరు శ్రీను నుంచి మరో నిందితుడికి మధ్య 28 కాల్స్ వచ్చాయి. గుంటూరు శ్రీను నుంచి ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్ వచ్చాయి.  కిడ్నాప్ జరుగుతున్నంత సేపు గుంటూరు శ్రీను కిడ్నాపర్లతో మాట్లాడారు. కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్ ను ట్రేస్ చేశారు.

జనవరి 5న కిడ్నాపర్లు కూకట్ పల్లిలోని లోధా బెలెజా అపార్ట్ మెంట్ నుంచి  మూవ్ అయ్యారు. అక్కడి నుంచి యూసఫ్ గూడలోని నవోదయ కాలనీలోని ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు వచ్చారు. అక్కడ భార్గవ్ రామ్ వెహికిల్ నంబర్ ప్లేట్లను మార్చారు.12 నంబర్ ప్లేట్లు తీసుకొస్తే 5 నంబర్ ప్లేట్లు మార్చారు. అక్కడి నుండి కిడ్నాప్ జరిగిన బోయిన్ పల్లి లొకేషన్ కు  వచ్చారు. అక్కడ కిడ్నాప్ జరిగిన తర్వాత ఒక టయోటా ఇన్నోవా వెహికల్ రాణిగంజ్ మీదుగా మెహదీపట్నం.. నార్సింగ్ నుంచి  మొయినాబాద్ కు వెళ్లారు. అక్కడ కిడ్నాప్ చేసిన ముగ్గురిని రాత్రంతా ఉంచారు. అర్థరాత్రి కిడ్నాపర్లు డీసీపీకి ఫోన్ చేసి ప్రవీణ్ సోదరులను వదిలేస్తున్నట్లు చెప్పారు.