ఆన్‌‌లైన్‌‌లో నామినేషన్లు..కరోనా వేళ ఈసీ కొత్త గైడ్ లైన్స్

ఆన్‌‌లైన్‌‌లో నామినేషన్లు..కరోనా వేళ ఈసీ కొత్త గైడ్ లైన్స్

కరోనా పోతలేదు.. దునియా ఆగుతలేదు. మాస్క్ లు, శానిటైజర్లు, ఫిజికల్ డిస్టె న్స్ వంటి జాగ్రత్తలు పడుతూనే బతుకుబండి ముందుకు సాగుతోంది. ఇదే స్ఫూర్తితో ఎలక్షన్ కమిషన్ ముందడుగు వేసింది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తాజాగా గైడ్ లైన్స్ జారీ చేసింది. నామినేషన్‌‌దాఖలు, ఎన్ని కల ప్రచారం, పోలింగ్‌‌, ఓట్లలెక్కింపు సమయాల్లో కరోనా వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లను సూచిస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పార్లు, టీ వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల అభ్యర్థనలు,  సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈసీ 12 పేజీలతో గైడ్ లైన్స్ రూపొందించింది.

రిటర్నింగ్‌‌ అధికారికి నామినేషన్ కాపీ

‘‘ఆన్‌‌లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేయాలి. నామి నేషన్‌‌సమయంలో డిపాజిట్‌‌చేయాల్సిన మొత్తాన్ని ఆన్‌‌లైన్‌‌ద్వారానే చెల్లించా లి. ఆన్‌‌లైన్‌‌లో సమర్పిం చిన నామినేషన్ ప్రింట్‌‌కాపీని రిటర్నింగ్‌‌ అధికారికి సమర్పించాలి. నామినేషన్ పేపర్లను  ఎలక్షన్ ఆఫీస్ లో అందజేసేందుకు క్యాండిడేట్ తోపాటు ఇద్దరు వ్యక్తులు, రెండు కార్లకు అనుమతి ఇస్తారు’’ అని ఈసీ సూచించింది. రిటర్నింగ్ ఆఫీసర్ చాంబర్‌‌లో తగినంత స్థలం ఉండాలని.. ఫిజికల్ డిస్టె న్స్ పాటిస్తూ నామినేషన్ దాఖలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు తదితరాలకుస్పేస్ ఉండాలని పేర్కొంది.

సిబ్బందికి ఫేస్ మాస్క్ లు

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారంతా ఫేస్ మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్స్, గ్లోవ్స్ ఉపయోగించాలని, సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ కచ్చితంగా పాటి చాలని ఈసీ ఆదేశించింది. ‘‘ఎన్నికలు జరిగే రాష్ర్టానికి నోడల్ హెల్త్ ఆఫీసర్ ను నియమిస్తాం. జిల్లాలు, అసెంబ్లీనియోజకవర్గాల్లో కరోనా సంబంధిత ఏర్పా ట్లు చూసుకోవాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసే దాకా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎన్నికల అధికారులకు ఆన్ లైన్ లోనే ట్రైనింగ్ ఇవ్వాలి’’ అని వివరించింది.

పోలింగ్‌‌ కేంద్రం దగ్గర శానిటైజర్లు, సబ్బులు

ఓటరు రిజిస్టర్‌‌లో సంతకం చేయడం, ఓటేయడానికి ఈవీఎం బటన్ మీద నొక్కడం కోసం ఓటర్లకు గ్లోవ్స్ ఇవ్వాలని ఈసీ సూచించింది. ‘‘పోలింగ్‌‌ కేంద్రం వద్ద థర్మల్‌‌ స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎంట్రీ, ఎగ్జిట్  దగ్గర శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి. భౌతికదూరం పాటించేందుకు వీలుగా గుర్తులు ఏర్పాటు చేయాలి. మ్యాగ్జి మమ్ మ్యాగ్జి 1,000 మంది ఓటర్లే పోలింగ్ బూత్ వద్ద ఉండాలి’’ అని స్పష్టం చేసింది. ‘‘హెల్త్ మినిస్ట్రీ సూచించిన దానికంటే ఎక్కువగా టెంపరేచర్ చూపిస్తే.. వారికి పోలింగ్ ముగియడానికి గంట ముందు ఓటువేసే అవకాశం కల్పించాలి. అప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకు న్నాకే అనుమతించాలి’’ అని పేర్కొంది.

ప్రచారంలో ఐదుగురే

ఇంటింటికి వెళ్లిప్రచారం చేసే వారి సంఖ్య అభ్యర్థితో పాటు ఐదుగురికి మించొద్దని స్పష్టం చేసింది. సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. కేంద్రం రూల్స్ కు అనుగుణంగానే కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేసింది.

కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్

కరోనా బారిన పడిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది. 80 ఏళ్లు దాటిన వారు, వైకల్యం ఉన్న వారు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న వారు పోస్ట ల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చని సూచించింది. వీటికి సం బంధించిన గైడ్ లైన్స్ తర్వాత జారీ చేస్తామని ప్రక టించింది.

ఓట్ల కౌంటింగ్ ఇట్లుంటది..

ఓట్లకౌంటింగ్ సమయంలో ఒక హాల్‌‌లో 7 టేబుళ్ల కంటే ఎక్కువ అనుమతించరని ఈసీ పేర్కొంది. నియోజకవర్గంలో అదనపు సహాయ రిటర్నింగ్‌‌అధికా రుల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారని వివరించిం ది. ‘‘వీవీప్యాట్‌‌లను కౌంటింగ్ కు ముందు శానిటైజ్‌‌ చేయాలి. కౌంటింగ్ సెంటర్లను లెక్కింపుకు ముందు, తర్వాత శానిటైజ్‌‌ చేయాలి’’ అని సూచించింది. ‘‘ఎన్నికల సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వారిని రిప్లేస్ చేసేందుకు కొందరు స్టాఫ్ ను రిజర్వ్ లో ఉంచాలి. పోలింగ్, కౌంటింగ్, ఇతర సిబ్బంది రీప్లేస్ కు సంబంధించిన ఏర్పాట్లను రిటర్నింగ్ ఆఫీసర్ చూసుకోవాలి’’ అని స్పష్టం చేసింది.

ఈసీకి పార్టీల సూచనలు ఇవీ..

బీహార్‌‌లో ఎన్నికల నిర్వహణపై పార్ల టీ నుంచి ఈసీ సలహాలు, సూచనలు కోరింది. ఇందులో ఆసక్తికర వినతులు వచ్చాయి. జైలు శిక్ష అనుభవిస్తున్నవ్యక్తులు వర్చువల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనకూడదని బీజేపీ కోరింది. ఆర్జేడీ ర్జే అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను దృష్టిలో పెట్టుకుని ఇలా కోరినట్లు ఎక్స్ పర్టులు చెబుతున్నారు. ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు పార్లను టీ అనుమతించాలని బీజేపీ కోరింది. దీనిని ఓటర్లకు ఇస్తున్న ‘లంచం’గా పరిగణించొద్దని పేర్కొంది. ఎన్నికలకు ఈవీఎంలను వాడొద్దని, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలు వాడటం వల్ల కోట్లమంది కరోనాకు ఎక్స్ పోజ్ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. మీటింగ్స్లో కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే అందుకు పార్లు, టీ నేతలను బాధ్యులను చేయకూడదని కాంగ్రెస్ కోరింది. ఓటు వేసేందుకు వచ్చి ఓటర్ కరోనా బారిన పడితే.. సదరు ఓటర్ కు లైఫ్ ఇన్సూ రెన్స్ కవరేజ్ ఇవ్వాలని ఆర్జేడీ కోరింది. పోలింగ్ స్టాఫ్ అందరికీ కరోనా టెస్టులు చేయాలని మజ్లిస్ కోరింది.