లోకల్ ట్రైన్లో దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఒకరికి తీవ్రగాయాలు

లోకల్ ట్రైన్లో దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఒకరికి తీవ్రగాయాలు

బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ గొడవలు జరుగుతుంటాయి. కొన్నికొన్ని సార్లు కొట్టుకుంటుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు.. ఒకటిరెండు దెబ్బలతో అలసిపోయి ఎవరి దారిన వారు పోతారు. కానీ ఈ మహిళలను చూడండి..ఎంత దారుణంగా కొట్టుకున్నారో.. ఏకంగా తలలు పగిలి రక్తం కారుతున్నా కొట్టుకోవడం ఆపలేదు..ముంబై లోకల్ ట్రైన్ ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

ముంబై లోకల్ ట్రైన్ లో ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు.చర్చిగేట్ నుంచి విరార్ కు ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ లేడీస్ స్పెషల్ కంపార్టుమెంట్ లో నిలబడేందుకు జాగా కోసం రక్తం వచ్చేలా సిగపట్టు పట్టారు. ఒకరి జుట్టు మరొకరు గుంజుతూ వీరోచింతంగా పోట్లాడారు. దీంతో ఇద్దరు మహిళలకు జుట్టు ఊడిపోయి రక్తం చిందింది. 

కంపార్టుమెంటులో ప్రయాణిస్తున్న మరో ప్యాసింజర్ ఈ వీడియో తీసి సోషల్  మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. రెండు నిమిషాల వీడియో క్లిప్‌లో ఒక మహిళ రైలు కారిడార్‌లో తలపై రక్తంతో  తీవ్ర వాగ్వాదానికి దిగింది. కొన్ని క్షణాల తర్వాత మరోసారి పిడిగుద్దులతో ఇద్దరు విరుచుపడ్డారు. ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాగడం, కొట్టడం, అసభ్య పదజాలంతో తిట్టుకోవడం వీడియోలో వినిపిస్తుంది.  

ఇద్దరు మహిళల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కంపార్టుమెంట్ అంతా గందరగోళంగా మారింది. మిగతా ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిద్దరిని నిలువరిస్తున్నట్లు కనిపిస్తుంది. 

ముంబై, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో రద్దీగా ఉండే సబర్బన్ రైళ్లలో సీట్లకోసం, నిలబడేందుకు జాగాకోసం గొడవలు సాధారణం అయినప్పటికీ ఈ కేసులో మాత్రం గొడవ.. హింసాత్మకంగా మారడం ఆందోళన రేకెత్తించింది. వివాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు గానీ ఈ ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయింది.ఇక ఈ ఘటనపై రైల్వే అధికారులకు అధికారిక ఫిర్యాదులు  అందినట్లు ఎలాంటి సమాచారం లేదు.