ప్రధాని మోదీ, అమిత్ షాలను ప్రజలు నమ్మడం లేదు: ప్రియాంకగాంధీ

ప్రధాని మోదీ, అమిత్ షాలను ప్రజలు నమ్మడం లేదు: ప్రియాంకగాంధీ

బీజేపీ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ తీవ్ర విమర్శలు చేశారు.ఓట్ చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు..బీజేపీ ఓట్ చోరీతో గెలించిందని దేశం మొత్తానికి తెలుసన్నారు. దమ్ముంటే న్యాయంగా ఎన్నికలలో పోరాడాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు సవాల్ విసిరారు. 

ఆదివారం (డిసెంబర్ 14) ఢిల్లీలో జరిగిన ఓట్ చోర్, గద్దీ చోడ్ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  ఓట్ చోరీతో మోదీ, అమిత్ షాలను ప్రజలు నమ్మడం లేదు..బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో న్యాయంగా పోరాడాలని సవాల్ విసిరారు.

బ్యాలెట్ లో పోటీ చేస్తే బీజేపీ గెలవలేదని వారికి తెలుసన్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడాల్సిన అవసరంలేదన్నారు. ఎందుకంటే బీజేపీ ఓట్ చోరీతో గెలిచిందన్న విషయం దేశమంతా తెలుసన్నారు. 

ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని, అమిత్ షాను నమ్మడం లేదన్నారు. అందుకే పార్లమెంటులో బీజేపీ ఆత్మవిశ్వాసం తగ్గిందన్నారు. పార్లమెంటును నడుపుతున్న తీరును ప్రియాంకగాంధీ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను పీడిస్తున్న సమస్యలపై లేవనెత్తేందుకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. బదులుగా వందేమాతరం పై చర్చకు పెట్టిందన్నారు. 

SIR, ఎన్నికలపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టడంతో బీజేపీ వెనక్కి తగ్గిందన్నారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేపర్ లీక్, వంటి పెద్ద సమస్యలపై చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వానికి  ధైర్యం లేదని ఆరోపించారు ప్రియాంక గాంధీ. 

ఎన్నికల్లో అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్  పోరాడుతుందన్నారు ప్రియాంకగాంధీ. ఓట్ చోరీ,   SIR అంశంపై  కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని విస్తృతం చేస్తుందన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక ముందడుగు అన్నారు ప్రియాంకగాంధీ.