నాన్ వెజ్ పికెల్స్: మటన్.. చికెన్ నిల్వ పచ్చడి.. ఇలా ఒక్కసారి తయారు చేయండి.. నెల రోజులు లాగించేయచ్చు..!

నాన్ వెజ్ పికెల్స్:  మటన్.. చికెన్ నిల్వ పచ్చడి.. ఇలా ఒక్కసారి  తయారు చేయండి.. నెల రోజులు లాగించేయచ్చు..!

మటన్.. చికెన్...ఎప్పుడు తిన్నా బోర్ అనిపించదు మాంసాహార ప్రియులకు.. కానీ వీటితో కూరలే కాదు. పచ్చళ్లు కూడా పెడతారు. అయితే అవి కొద్ది రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. మార్కెట్లో నాన్ వెజ్ దొరకని. ప్రాంతంలో వీటితో సరిపెట్టుకోవచ్చు. కాబట్టి ఒకసారి సారి ట్రై చేయండి. . .

మటన్​ స్పైసీ పికెల్​ తయారీకి కావలసినవి

  • మటన్ :పావుకిలో
  • పోపు దినుసులు: రెండు టీ స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి ముద్ద: ఒక టేబుల్ స్పూన్
  • మెంతులు: ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర పొడి : ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర: ఒక టీ స్పూన్
  • ఎండుమిర్చి: నాలుగు
  • పసుపు :రెండు టీ స్పూన్లు
  • గరం మసాలా పొడి: ఒక టేబుల్ స్పూన్
  • నిమ్మరసం: అర కప్పు
  • కారం: రెండు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు: తగినంత
  • కరివేపాకు: మూడు రెమ్మలు
  • కొత్తిమీర తరుగు: అర కప్పు
  • పుదీనా : రెండు రెమ్మలు
  • నూనె: రెండు టేబుల్​ స్పూన్లు

మటన్​ స్పైసీ పికెల్ తయారీ విధానం: 

 మటన్​ శుభ్రం చేసి కుక్కర్​ లో వేసి కొద్దిగా పసుపు, ఉప్పు, నీళ్లు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరిపోయాక మటన్ ముక్కలు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టాలి. స్టవ్​ పై పాన్​ పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర వేయాలి.  

తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేగించి స్టవ్​ ఆఫ్ చెయ్యాలి. 

ఆ మిశ్రమం రెండు నిమిషాలు పాటు చల్లారాక దానిలో పసుపు, కారం, మెంతులు, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు, పుదీనా, తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత గరం మసాలా పొడి ఉడికించిన మటన్ వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా చల్లారాక నిమ్మరసం కలిపితే 'మటన్ పికిల్' రెడీ. 

దీన్ని గాలి జొరబడని డబ్బాలో పెట్టాలి. రెండు రోజులు తర్వాత తెనాలి. ఇది పదిహేను, ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది.. . 


చికెన్​ నిల్వ పచ్చడి తయారీకి కావలసినవి

 

  • బోన్​ లెస్​ చికెన్​ :అరకిలో 
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ :నాలుగు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు: తగినంత
  • జీడిపప్పు :అర కప్పు
  • పచ్చికారం: ఒక కప్పు
  • మెంతి పొడి :ఒక టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్
  • గరం మసాలా: ఒక టేబుల్ స్పూన్
  • నిమ్మరసం :పావు కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు :అర కప్పు
  • కరివేపాకు: పది రెమ్మలు
  • పసుపు : ఒక టేబుల్ స్పూన్
  • నూనె : 300 గ్రాములు

చికెన్​ నిల్వ పచ్చడి తయారీ  విధానం :  

చికెన్​ శుభ్రం చేసి పక్కన పెట్టాలి.  స్టవ్​ పై  బాండీ పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె బాగా వేడెక్కాక చికెన్ పసుపు కొంచెం ఉప్పు వేసి ఫ్రై చెయ్యాలి.  

చికెన్ బ్రౌన్ కలర్​ లోకి వచ్చేంత వరకూ ఫ్రై చేసి నూనె నుంచి చికెన్ ముక్కలను తీసి ఒక ప్లేటులో పెట్టాలి. తర్వాత ఆ నూనెలో జీడిపప్పు వేసి వేగించి పక్కన పెట్టాలి. 

కరివేపా కు, వెల్లుల్లి రెబ్బలు కూడా విడివిడిగా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేగించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిసేపు వేగాక దానిలో కొంచెం ఉప్పు వేసి వేగించాలి. 

ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి వచ్చేంత  వరకూ వేగించి ధనియాల పొడి, గరం మసాలా పొడి వెయ్యాలి. ఆ మిశ్రమం కొద్దిగా వేగాక కారం వేసి వేగించాలి. రెండు నిమిషాలు వేగాక చికెన్ ముక్కలు,  జీడిపప్పు వేసి ఆ మిశ్రమంలో కలిపి కొద్దిసేపు వేగించి  స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

 మిశ్రమం బాగా చల్లా రాక మెంతిపొడి, నిమ్మరసం, కరివేపాకు చె వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపితే చికెన్ పీకల్" రెడీ. తడిలేని ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ భద్ర పరిస్తే ఇరవై నుంచి నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది.