హై అలర్ట్: బీహార్ లో బర్డ్ ఫ్లూ కలకలం..

హై అలర్ట్:  బీహార్ లో బర్డ్ ఫ్లూ కలకలం..

బీహార్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలోని నౌగాచియా సబ్‌డివిజన్‌లో 150 కి పైగా కాకులు చనిపోయాయి.  ఘటనా స్థలానికి వెళ్లిన హెల్త్ ఆఫీసర్స్  ల్యాబ్ కు బ్లడ్ శాంపిల్స్ పంపించి టెస్ట్ చేయగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారరణ అయ్యింది. 

 జనవరి 11 నుంచి నౌగాచియాలో చెట్టుకింది చాలా కాకులు చనిపోవడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అటవి శాఖ బఈృందాలు, సంఘటనా స్థలానికి చేరుకుని  చనిపోయిన పక్షులను తొలగించారు. వాటి బ్లాడ్ శాంపిల్స్ ను టెస్టుకు పంపించారు.  రెండు ల్యాబ్ లలో టెస్టులు వచ్చాక బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్టు జిల్లా పశుసంవర్ధక అధికారి అంజలి కుమారి అధికారికంగా ధృవికరించారు. దీంతో ప్రభావిత జోన్ చుట్టు 10 కి.మీ దూరంలో శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  చెబుతున్నారు.

‘ జనవరి 11న నౌగాచియాలో  కాకులు చనిపోయాయి, ఆ సమయంలో చాలా చలిగా ఉంది, కాబట్టి అవి చలి కారణంగా చనిపోయయనుకున్నాం.  మేము  టెస్టు కోసం శాంపిల్స్  పంపాము.  బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని నిర్ధారణ అయ్యింది.  ప్రస్తుతం  మేము ప్రభావిత ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నాం.   ఈ ప్రాంతంలోని అన్ని కోళ్ల ఫామ్‌లపై  నిఘా పెట్టాం.నివాసితులు భయపడొద్దు. చనిపోయిన పక్షులను తాకకూడదని  భాగల్పూర్ జిల్లా పశుసంవర్ధక అధికారిణి డాక్టర్ అంజలి కుమారి సిన్హా  తెలిపారు.