ఆసియా టాప్ షాపింగ్ స్ట్రీట్స్ లో.. బంజారాహిల్స్, హిమాయత్ నగర్

ఆసియా టాప్ షాపింగ్ స్ట్రీట్స్ లో.. బంజారాహిల్స్, హిమాయత్ నగర్

ఆసియా టాప్ స్ట్రీట్ లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. గ్లోబల్ సిటీ గా అభివృద్దిచెందుతున్న మహానగరంలోని బంజారాహిల్స్, హిమాయత్ నగర్ ప్రాంతాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అత్యంత విలువైన 50 షాపింగ్ స్ట్రీట్స్ లో స్థానం దక్కించుకుని అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. లగ్జరీ ,రిటైల్ షాపింగ్‌కు కేంద్రాలుగా పేరుగాంచి ప్రపంచంలోని ప్రధాన స్ట్రీట్‌లతో పాటు ఈ జాబితాలో చేరాయి. 

కుష్మాన్, వేక్‌ఫీల్డ్ మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2025 నివేదికలో ఆసియాలో 50 షాపింగ్ వీధుల జాబితాలో బంజారా హిల్స్, హిమాయత్‌నగర్ 48వ స్థానంలో ఉన్నాయి. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఏకైక నగరంగా నిలిచింది.

ప్రశాంతమైన వాతావరణంతో కూడిన బంజారా హిల్స్ చాలా కాలంగా ప్రీమియం బోటిక్‌లు, కేఫ్‌లు, ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లు ,క్యూరేటెడ్ డిజైనర్ స్పేస్‌లకు చిరునామాగా ఉంది.లగ్జరీ ,జీవనశైలి, కస్టమర్ బేస్ బ్రాండ్ లకు ఆకర్షణగా నిలిచింది.  దేశంలోని ఫేమస్ బ్రాండ్స్ వస్తువులన్నీ  ఇక్కడ దొరుకుతున్నాయి. 

దీనికి విరుద్ధంగా సరసమైన ధరలతో హిమాయత్‌నగర్‌ షాపింగ్ అడ్డాగా మారింది. రిటైల్ బ్రాండ్లు కోరుకునే ఇక్కడి ప్రజలకు అందుబాటు ధరల్లో ఆభరణాల దుకాణాలు, బేకరీలు, బుక్ స్టాల్స్, స్టేషనరీ షాపులకు ఫేమస్ ఈ ప్రాంతం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రిటైల్ బ్రాండ్స్‌ను కోరుకుంటుండటంతో షాపింగ్ డెస్టినేషన్‌గా ఉంది. 

ర్యాంకింగ్ ఎలా ఇస్తారంటే..

కుష్మాన్ & వేక్‌ఫీల్డ్ వార్షిక నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన హై-స్ట్రీట్ రిటైల్ స్థానాలను అంచనా వేస్తుంది. అద్దె, బ్రాండ్ ఆసక్తి, రద్దీ,వినియోగదారుల ప్రవర్తనపై దృష్టి పెడుతుంది. హైదరాబాద్ రిటైల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో మాత్రమే కాకుండా రిటైల్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీగా మారుతోందని ఇది సూచిస్తోంది. 

దేశ విదేశాల బ్రాండ్ వస్తువులు నగరంలోకి దొరుకుండటంతో స్థానిక వ్యాపారం బాగా అభివృద్దిచెందుతున్నందున బంజారా హిల్స, హిమాయత్ నగర్ వంటి హైదరాబాద్ హైస్ట్రీట్స్ గతంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.  ప్రపంచ ఆకాంక్షలకు అనుగుణంగా  ఇతరు దేశాల వారిని అకర్షిస్తుండటంతో ఈ గుర్తింపు లభించింది.

ఈ గుర్తింపు హైదరాబాద్ రిటైల్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా పోటీగా మారుతోందని తెలియజేస్తోంది. అనేక అంతర్జాతీయ బ్రాండ్లు క్రమంగా నగరంలోకి దొరుకుతుండటంతో హైదరాబాద్ వీధులు షాపింగ్ అడ్డాగా మారుతున్నాయి.

ఇండియాలోని టాప్ ఆసియా పసిఫిక్ షాపింగ్ స్ట్రీట్స్ ఇవే.. 

ర్యాంక్.. ప్రాంతం

24  ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ
26  కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ
26  గల్లెరియా మార్కెట్, గుర్గావ్
34  లింకింగ్ రోడ్, వెస్ట్రన్ సబర్బన్, ముంబై
36  పార్క్ స్ట్రీట్, కోల్కతా
39  ఫోర్ట్/ఫౌంటెన్, ముంబై
40  కెంప్స్ కార్నర్, ముంబై
41  బ్రిగేడ్ రోడ్, బెంగళూరు
42  విట్టల్ మాల్యా రోడ్, బెంగళూరు
44  MG రోడ్, పూణే
45  ఇందిరానగర్ 100 అడుగుల రోడ్డు, బెంగళూరు
46  FC రోడ్, పూణే
48  బంజారా హిల్స్, హైదరాబాద్
48  హిమాయత్ నగర్, హైదరాబాద్

50  పాండి బజార్, చెన్నై
51   అన్నానగర్ 2వ అవెన్యూ, చెన్నై