విమానం గాల్లో ఉండగానే.. ప్యాసింజర్ కు అస్వస్థత.. సీపీఆర్ చేసి బ్రతికించిన మాజీ ఎమ్మెల్యే

విమానం గాల్లో ఉండగానే.. ప్యాసింజర్ కు అస్వస్థత.. సీపీఆర్ చేసి బ్రతికించిన మాజీ ఎమ్మెల్యే

విమానం గాల్లో ఉండగానే ..ప్యాసింజర్ కు తీవ్ర అస్వస్థత..ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.. ఆ సయమంలో తోటి ప్రయాణికురాలికి ప్రయాణం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆమె ప్రాణాలు కాపాడింది.  స్వతహాగా డాక్టర్అయిన మాజీ ఎమ్మెల్యే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన మహిళకు అత్యవసర పరిస్థితిలో సీపీఆర్ ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళితే.. 

శనివారం మధ్యాహ్నం.. ఇండిగో విమానం  గోవానుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. అమెరికాకు చెందిన జెన్నీ అనే మహిళ ప్రయాణికురాలు  ఉన్నట్టుండి విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే  కుప్పకూలింది. దీంతో విమానంలో తోటి ప్రయాణికురాలిగా ఉన్న కర్ణాటకలో ని కాన్ఫూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి వెంటనే అప్రమత్తమయ్యారు. జెన్నీకి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత  వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జెన్నీ  సేఫ్ గా ఉంది. 

డాక్టర్ అంజలి సేవలను  కర్ణాటకసీఎం సిద్దరామయ్య ప్రశంసించారు. అంజలీ  సేవలు స్పూర్తిదాయకం.. అధికారంలో ఉన్నా లేకపోయినా  అంజలి లాంటి నేతలు ప్రజాసేవలు ఉంటారని పొగిడారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసేందుకు ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటారని  తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X లో పోస్ట్ చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. ఇక అంజలి సేవలను కొనియాడుతూ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టులు పెట్టారు.