తెలంగాణ‌లో కొత్త మ‌ద్యం రేట్లు ఇవే

తెలంగాణ‌లో కొత్త మ‌ద్యం రేట్లు ఇవే

తెలంగాణ‌లో ఇవాళ్టి నుంచి కంటైన్మెంట్ జోన్లు మిన‌హా మిగ‌తా అన్నిచోట్ల మ‌ద్యం షాపులు తెరుచుకోనున్న విష‌యం తెలిసిందే. అలాతే మ‌ద్యం ధ‌ర‌లు పెంచిన ప్ర‌భుత్వం.. ఇందుకు సంబంధించిన కొత్త ధ‌ర‌ల వివ‌రాలను వెల్ల‌డించింది. చీప్ లిక్క‌ర్ పై 11 శాతం,  మిగ‌తా అన్ని బ్రాండ్ల‌పై 16 శాతం ధ‌ర‌ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

కొత్త మ‌ద్యం ధ‌ర‌లు ఇవే..

ఆర్డిన‌రీ 90 ఎంఎల్ , 180 ఎంఎల్ లిక్క‌ర్ పై రూ.10 పెంపు
375 ఎంఎల్ పై రూ. 20 పెంపు
750 ఎంఎల్ పై రూ. 40 అద‌నంగా పెరిగింది
మీడియం లిక్క‌ర్ పై 90 ఎంఎల్, 180 ఎంఎల్ పై రూ.20 పెంపు
375 ఎంఎల్ పై రూ. 40 పెంపు
750 ఎంఎల్ పై రూ. 80 పెరిగింది
అన్ని సైజుల బీర్ల‌పై రూ.30 పెరిగింది