కూకట్ పల్లి ఏరియాల్లో కొత్తగా వచ్చిన ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవే..

కూకట్ పల్లి ఏరియాల్లో కొత్తగా వచ్చిన ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవే..

కూకట్​పల్లి ఏరియాలో రోజూ సాయంత్రం ఏర్పడుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పాయింట్లను గుర్తించి, పలు రూట్లలో రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

మూసాపేట, ఎర్రగడ్డ దిశ నుంచి వచ్చే వాహనాలను ఇకపై మూసాపేట వైపు నుంచి కూకట్‌పల్లి వైజంక్షన్ వైపు మళ్లించనున్నారు. కూకట్‌పల్లి వైజంక్షన్ నుంచి ఐడీఎల్ చెరువు వైపు వెళ్లే వాహనాలను జేఎన్టీయూ దిశగా మళ్లించనున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు నుంచి కైత్లాపూర్ వెళ్లే వాహనాలను ఇక నుంచి నెక్సస్ మాల్– జేఎన్టీయూ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకున్న ఈ మార్పులను వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.