ఇలా చేస్తే మొటిమలు, నల్లటి మచ్చలు పోతయ్

ఇలా చేస్తే మొటిమలు, నల్లటి మచ్చలు పోతయ్

చింతపండు ప్యాక్​ ముఖానికి వేసుకుంటే మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌‌ సమస్యలకు దూరంగా ఉండొచ్చు తెలుసా!

  • ముప్పై గ్రాముల చింతపండుని ఒక కప్పు  నీళ్లలో వేసి  మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.  చల్లారాక గుజ్జు తీయాలి. అందులో అర టీ స్పూన్​  పసుపు కలిపి ముఖానికి ప్యాక్​లా వేయాలి. ఇరవై నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి . ఇలా వారానికొకసారి చేస్తే  పసుపు, చింతపండులో ఉండే   యాంటీఆక్సిడెంట్​ ప్రాపర్టీలు ముఖం మీద ఉండే మొటిమలు, నల్లటి మచ్చల్ని పోగొడతాయి. 
  • ఒక టీ స్పూన్​ చింతపండు గుజ్జులో  ఒక టీ స్పూన్​ తేనె, రెండు టీ స్పూన్​ల శనగపిండి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని  ముఖం, మెడ భాగాలకి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో  శుభ్రం చేసుకుంటే చర్మం మెరుస్తుంది. 
  • ఒక టేబుల్​ స్పూన్​ చింతపండు గుజ్జులో ఒక టీ స్పూన్​  చక్కెర,  ఒక టీ స్పూన్​ వెన్న లేదా పెరుగు వేసి బాగా కలిపి ​ముఖం, మెడ భాగాలకు పట్టించాలి.  చేతివేళ్లను గుండ్రంగా తిప్పుతూ పదినిమిషాలు మసాజ్​ చేయాలి. ఈ ప్యాక్​ తరచూ వేసుకుంటే  చింతపండు గుజ్జులోని  ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్​  చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది.